సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మెదక్ ఎంపీ..
By Prajaswaram
On
గజ్వెల్ జనవరి 20 (ప్రజాస్వరం):
వర్గల్ మండలం నాచారం గ్రామంలో సిసి రోడ్లకు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు దాదాపు 20 లక్షల పనుల కోసం శంకుస్థాపన చేశారు. ఎన్నో సంవత్సరాల గ్రామస్తుల కోరిక ఇప్పటితో నెరవేరబోతుందని గ్రామస్తులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు పూదరి నందన్ గౌడ్, మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ ఈసురి సారిక, ఉప సర్పంచ్ బుస వినయ్, వార్డు మెంబర్లు గ్రామ సీనియర్ నాయకులు కట్ట రమేష్ , బండ్ల రవీందర్, నరేష్, పర్స యాదగిరి, బుస నరసింహులు , బాదే వాసుదేవ్ పాల్గొన్నారు
Latest News
04 Feb 2026 06:56:36
తూప్రాన్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని టోల్ ప్లాజా వద్ద మంగళవారం రోజు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలిసులకు...


