చికిత్స పొందుతూ యువతి .....

చికిత్స పొందుతూ యువతి .....

తూప్రాన్ 20( ప్రజాస్వరం) :

పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మండలం నర్సంపల్లి రెడ్యానాయక్ తాండలో మమత (18)అనే యువతి ఎలుకల మందు తాగి ఈనెల 16న ఆత్మహత్య ప్రయత్నం చేయగా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . మెరుగైన వైద్యం కోసం ఆర్ వి ఎం ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేస్తున్న క్రమంలో రాత్రి మృతి చెందింది .ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది .మృతురాలి మమతకు తల్లిదండ్రులు చనిపోయారు .అన్నా చెల్లె ఒకే ఇంట్లో ఉంటున్నారు .కుటుంబీకులు ఫిర్యాదులో మరణం పై ఎలాంటి అనుమానాలు లేవని ఫిర్యాదు చేశారు. తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు,