మల్కాపూర్ అభివృద్ధి పై అధ్యయనం రాజస్థాన్ అధికారులు .... 

మల్కాపూర్ అభివృద్ధి పై అధ్యయనం రాజస్థాన్ అధికారులు .... 

తూప్రాన్ జనవరి 22 (ప్రజాస్వరం) :

పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి 

తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన స్వచ్ఛభారత్ మిషన్ జాయింట్ డైరెక్టర్ మురళి లాల్ శర్మ, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ కమల్ లు సందర్శించారు.అభివృద్ధి పై అధ్యయనం చేశారు గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, రాక్ గార్డెన్, అంగన్వాడి, ఇంకుడు గుంతలను పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీలో పలు రికార్డులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ సిబ్బంది వేతనాలు, ప్రతిరోజు నిర్వహించే పని కార్యక్రమాలపై ఆరా తీశారు. అలాగే ఇంకుడు గుంతల పనితీరును గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి విచ్చేసిన అధికారులను సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో SLWM స్టేట్ అధికారి టివిఎం సూర్య, సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఏపీవో సంతోష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, టెక్నికల్ అసిస్టెంట్ లు సురేష్, సత్యం, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు.