ప్రజల పక్షాన నిలబడుతా ఒక్క అవకాశం ఇవ్వడి..

14వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా మామిళ్ల రేణుక నాగులు 

ప్రజల పక్షాన నిలబడుతా ఒక్క అవకాశం ఇవ్వడి..

గజ్వేల్,జనవరి 21 (ప్రజాస్వరం):                                          గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి నాయకులు మామిళ్ల రేణుక నాగు ముదిరాజ్ ఆధ్వర్యంలో, గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ కుడికాల రాములు, సహ ఇంచార్జ్ తోకల లక్ష్మారెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. 14వ వార్డు బూత్ అధ్యక్షులు తుప్పటి నరేష్ అధ్యక్షతన పార్టీ నాయకులు వార్డులోని ప్రతి ఇంటినీ సందర్శించి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా మామిళ్ల రేణుక నాగు ముదిరాజ్ మాట్లాడుతూ తనకు ఎలాంటి పదవులు లేకపోయినప్పటికీ, ప్రజా సమస్యలను తన సొంత సమస్యలుగా భావించి నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం బిజెపి పార్టీకి మద్దతు తెలపాలని, రాబోయే ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.