తూప్రాన్ ఎసై గా గంగారాజు బాధ్యతలుస్వీకారణ... 

తూప్రాన్ ఎసై గా గంగారాజు బాధ్యతలుస్వీకారణ... 

తూప్రాన్ జనవరి 21 (ప్రజాస్వరం ):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)గా బుధవారం సాయంత్రం గంగారాజు బాధ్యతలు స్వీకరించారు. తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు కాపాడటం ప్రధాన బాధ్యతగా అన్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు తెలియజేశారు రోడ్డు ప్రమాదాల నివారణ, ఆస్తి నేరాల నియంత్రణ, మహిళలు మరియు బలహీన వర్గాల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాము. రాబోయే ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించడానికి ప్రజల సహకారం అత్యంత అవసరం. పోలీస్ శాఖకు తూప్రాన్ ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని ఎసై గంగారాజు కోరుతున్నారు