గాంధీ లాంటి మహనీయుల పేర్ల మార్పు సరికాదు..

ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు...

గాంధీ లాంటి మహనీయుల పేర్ల మార్పు సరికాదు..

ఎంజిఎన్ఆర్ఇజిఏ పేరు మార్పు విడ్డూరం....

ఉపాధి హామీ చట్టం పని గంటల తగ్గింపు ను విరమించుకోవాలి...

 మెదక్ జనవరి 20 (ప్రజాస్వరం):

 

దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా గాంధీ పేరును తొలగించి ఉపాధి హామీ కూలీల పని గంటలను తగ్గించడం ప్రజలను అవమాన పరచడ మేనని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మంగళవారం మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తాలో మంగళవారం నిర్వహించిన దీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ ఏ పథకం పేరు మార్చడంతో పాటు కూలీల పని గంటలను తగ్గించడం కేంద్ర ప్రభుత్వం ప్రజల పట్ల చూపుతున్న వివక్షనని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఎంజిఎన్ఆర్జిఎస్ పథకం పేరును కొనసాగిస్తూ పని గంటలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు, ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.