పొలంలో విద్యుత్ షాక్‌తో యువ రైతు....
దౌల్తాబాద్, ఫిబ్రవరి 4 ( ప్రజాస్వరం):
రాయపోల్ మండలంలోని అనాజీపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై యువ రైతు మృతి చెందాడు.
పోలీసుల కథనం ప్రకారం.. అనాజీపూర్ గ్రామానికి చెందిన వెంకని స్వామి (35) వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో, కౌలుకు తీసుకున్న జంగం లింగం పొలంలో పారతో ఒరం తీస్తుండగా, బోర్ మోటార్ స్టార్టర్‌కు సంబంధించిన విద్యుత్ వైర్ పారకు తగిలింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి స్వామి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
కొద్దిసేపటి తర్వాత పొలం వద్దకు వచ్చిన తండ్రి రాజయ్య కుమారుడు పడిపోయి ఉండటాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న వారు పరిశీలించగా, స్వామి మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
వ్యవసాయ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై తన భర్త మృతి చెందాడని మృతుడి భార్య కనకలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఎస్ఐ కుంచం మానస తెలిపారు.


