అక్రమ మట్టి దందా..
5టిప్పర్ లు ఇటచ్ సిజ్....
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 4 (ప్రజాస్వరం):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మనోహరాబాద్ మండలంలో తుమ్మ కుంట నుండి అక్రమంగా గ్రావెల్( మట్టి) తరలిస్తున్న 5 టిప్పర్లు, 1 హిటాచి యంత్రం మరియు 1 లారీని పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించినట్లు తూప్రాన్ సిఐ రంగా కృష్ణ తెలిపారు స్వాధీనం చేసుకున్నా. ఈ వాహనాలు అనుమతులు లేకుండా గ్రావెల్ మట్టి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వాహనాల డ్రైవర్లు మరియు యజమానులపై కేసు నమోదు చేశారు. తదుపరి చర్యల కోసం ఈ కేసును కోర్టుకు పంపించారు. ప్రజలు చట్టాన్ని గౌరవించి ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడకూడదని పోలీసులు సూచించారు. అనుమతి లేకుండా గ్రావెల్ లేదా ఇతర ఖనిజాలను తరలించడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పనులు జరిగితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రంగా కృష్ణ హెచ్చరించారు.
Latest News
04 Feb 2026 15:41:26
అభివృద్ధి చేసిన పార్టీ నాయకులను గెలిపించండి... గజ్వేల్, 04 ఫిబ్రవరి (ప్రజాస్వరం): సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కప్ప...


