రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు..
తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్.
రామాయంపేట . జనవరి. 21.( ప్రజాస్వరం):
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ తెలిపారు. రామాయంపేట పోలీస్ స్టేషన్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.. తూప్రాన్ పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని 12 పోలీస్ స్టేషన్లో పరిధిలో గత ఏడాదిలో 408 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదాలలో 185 మంది మృతి చెందారని, 417 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. డివిజన్ పరిధిలో అత్యధికంగా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 68 రోడ్డు ప్రమాదాలు కాగా 35 మంది మృతి చెందారని, రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 60 రోడ్డు ప్రమాదాలు జరగగా 22 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. తూప్రాన్ లో 46 రోడ్డు ప్రమాదాలు కాగా 18 మంది మృతి చెందారని, శివంపేటలో 17 రోడ్డు ప్రమాదాలకు పదిమంది మృతి చెందినట్లు తెలిపారు, వెల్దుర్తిలో 11 రోడ్డు ప్రమాదాలకు ఇద్దరు మృతి చెందారని, మనోహరాబాద్ పిఎస్ పరిధిలో 37 రోడ్డు ప్రమాదాలు కాగా 12 మంది మృతి చెందారని, చిన్న శంకరంపేట పిఎస్ పరిధిలో 19 రోడ్డు ప్రమాదాలు జరగక 11 మంది మృతి చెందారని, నార్సింగిలో 28 రోడ్డు ప్రమాదాలు జరగగా 14 మంది చనిపోయారని, నిజాంపేటలో 11 రోడ్డు ప్రమాదాలకు ఇద్దరు మృతిచెందగా, నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 62 రోడ్డు ప్రమాదాలు జరగక 34 మంది మృతి చెందినట్లు తెలిపారు, కౌడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 42 రోడ్డు ప్రమాదాలు జరగక 20 మంది మృతి చెందారని, చిలిపి చెడ్ మండలంలో ఏడు రోడ్డు ప్రమాదాలు జరగక ఐదుగురు మృత్యువాత పడ్డారని తెలిపారు. తరచు రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది మృతి చెందుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని. తరచు వాహనాల తనిఖీ చేసి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామని తెలిపారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో ఎస్సై బాలరాజు పాల్గొన్నారు


