ఓటు హక్కు పై విద్యార్థులకు అవగాహన..

తహసిల్దార్ గ్రేస్ బాయి

ఓటు హక్కు పై విద్యార్థులకు అవగాహన..

నార్సింగి, జనవరి 23 ( ప్రజాస్వరం ):

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో, మండలం లోని అన్ని పంచాయతీలలో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తహశీల్దార్ గ్రేస్ బాయి ఆధ్వర్యంలో విద్యార్థులతో ఓటర్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులతో ఓటు హక్కు పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా గ్రేస్ బాయి, ఉపాద్యాయులు విద్యార్థులకు ఓటు హక్కు వినియోగం పై అవగాహన కల్పిస్తూ ఓటు వేయడం ప్రతి పౌరుని భాధ్యత అని, ప్రజా స్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని అన్నారు. ఓటు వజ్రాయుధమని, ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకుని సరైన విధంగా ఓటు హక్కును వినియోగించు కోవాలని అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా, డబ్బులకు ప్రలోభ పడకుండా, కుల, మత, భాషా పరమైన ప్రభావానికి లోను కాకుండా నిర్భయంగా ఎన్నికలలో ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వంగా ప్రీతీ రెడ్డి, ఆర్ ఐ శ్రీధర్, మేఘన, ఎమ్ఎన్ఓ రామకృష్ణా, పాఠశాల ఉపాద్యాయులు పూర్ణ చంద్రరావు, స్వామి పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది, రెవెన్యూ, పంచాయితీ రాజ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

జిన్నారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం... జిన్నారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం...
జిన్నారం, ఫిబ్రవరి 04(ప్రజాస్వరం): జిన్నారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ వార్డు సభ్యులతో విస్తృత స్థాయి ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి వార్డుకు...
జామియా మస్జిద్ లో "షబ్ ఏ బరాత్"సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలు...
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ...
గజ్వేల్ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ దే....
పొలంలో విద్యుత్ షాక్‌తో యువ రైతు....
అక్రమ మట్టి దందా..
టోల్‌ప్లాజా వద్ధ 300 గ్రాముల అల్పోజం పట్టివేత..