కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ...
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 04 : (ప్రజాస్వరం) :
తూప్రాన్ మున్సిపల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తూప్రాన్ మున్సిపాలిటీ 16వ వార్డు అధ్యక్షులు బందెల నరేష్ బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి బుధవారం గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జ్ తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వీరిని
నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ నాయకులు 16వ వార్డు అభ్యర్థి బొడ్డు జోష్నా వేణు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ,“ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం. ప్రజలకు మెరుగైన సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ వేదికగా పనిచేస్తాను” అని తెలిపారు.
ఈ పరిణామంతో తూప్రాన్ మున్సిపల్ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానికంగా నేతల మార్పులు కొనసాగుతాయా అనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది.
Latest News
04 Feb 2026 18:54:53
జిన్నారం, ఫిబ్రవరి 04(ప్రజాస్వరం): జిన్నారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ వార్డు సభ్యులతో విస్తృత స్థాయి ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి వార్డుకు...


