మల్కాపూర్ లో పశువుల కు చికిత్స......

మల్కాపూర్ లో పశువుల కు చికిత్స......

 తూప్రాన్ జనవరి 23( ప్రజాస్వరం) :

పూర్ణ రాజు ప్రతి నిధి 

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామం లో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సహకారం తో ఉచిత పశువైద్య శిబిరం ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి వెంకటయ్య మాట్లడుతూ గర్భకోశ వ్యాధి గ్రహస్థ పశువులకు చికిత్స లు చేయుంచుకోవాలని సూచించారు.పశువు కు సంతానం అయ్యిన 90 రోజులలో ఎద లక్షణాలు గమనించి గోపాలమిత్రులచే కృత్రిమ గర్భ ధారణ చేయుంచుకోవాలని, అలాగే సెక్స్ సోర్టెడ్ సెమిన్ వాడడం వలన 90శాతం ఆడ దూడలు పుడతాయని పాడిరైతులకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ మా గ్రామం లో ఇలాంటి పశువైద్య శిభిరాలు ఏర్పాటు చేసి పశువు లకు చికిత్స లు చేసి, ఉచితంగా మందులు పంపిణి చేసినందుకు పశు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో VAS డాక్టర్ లక్ష్మి , ఉప సర్పంచ్ స్వామి, LSA రమేష్ , VA లింగమూర్తి,ప్రభుదాస్ VA,DLDA సూపరవైజర్ సత్యనారాయణ గోపాలమిత్రులు రామస్వామి,అశోక్,శ్రీనివాస్,చంద్రశేఖర్ OS కృష్ణ మరియు పాడిరైతులు పాల్గొన్నారు

Latest News

జిన్నారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం... జిన్నారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం...
జిన్నారం, ఫిబ్రవరి 04(ప్రజాస్వరం): జిన్నారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ వార్డు సభ్యులతో విస్తృత స్థాయి ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి వార్డుకు...
జామియా మస్జిద్ లో "షబ్ ఏ బరాత్"సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలు...
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ...
గజ్వేల్ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ దే....
పొలంలో విద్యుత్ షాక్‌తో యువ రైతు....
అక్రమ మట్టి దందా..
టోల్‌ప్లాజా వద్ధ 300 గ్రాముల అల్పోజం పట్టివేత..