గణేష్‌పల్లి చౌరస్తాలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిరస్మరణీయులు -మాజీ జడ్పీటీసీ రామచంద్రం

గణేష్‌పల్లి చౌరస్తాలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

గజ్వెల్ జనవరి 23 (ప్రజాస్వరం):

నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిరస్మరణీయులు అని మాజీ జడ్పీటీసీ రామచంద్రం అన్నారు, శుక్రవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మర్కుక్ మండలం గణేష్‌పల్లి చౌరస్తాలో సర్పంచ్ రామరాజు, ఉప సర్పంచ్ నర్సింలు ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి ఎంబరి రామచంద్రం,సర్పంచ్ రామరాజు, మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహానాయకుడని, ఆయన ఆదర్శాలు యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.దేశభక్తి,త్యాగం, క్రమశిక్షణ విలువలను యువత అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పాలక వర్గం, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు,కనకయ్య, ఎర్రవల్లి సర్పంచ్ కవిత రాంమోహన్ రెడ్డి, అంగడి కిష్టాపూర్ సర్పంచ్ కొండల్ రెడ్డి నరసన్నపేట సర్పంచ్ ,బాలనర్సయ్య,ఉప సర్పంచ్ రామ్ రెడ్డి, చెబర్తి ఉప సర్పంచ్ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ మంజుల శ్రీరామ్, టీచర్ రామకృష్ణారెడ్డి,నాయకులు తుమ్మ కృష్ణ, బొగ్గుల రామచంద్రం, మల్లేశం,గుడాల శేఖర్,సుధాకర్, పోయిల ఆంజనేయులు, బాలకృష్ణ,యువకులు,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

జిన్నారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం... జిన్నారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం...
జిన్నారం, ఫిబ్రవరి 04(ప్రజాస్వరం): జిన్నారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ వార్డు సభ్యులతో విస్తృత స్థాయి ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి వార్డుకు...
జామియా మస్జిద్ లో "షబ్ ఏ బరాత్"సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలు...
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ...
గజ్వేల్ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ దే....
పొలంలో విద్యుత్ షాక్‌తో యువ రైతు....
అక్రమ మట్టి దందా..
టోల్‌ప్లాజా వద్ధ 300 గ్రాముల అల్పోజం పట్టివేత..