ప్రజల తరఫున ప్రశ్నించే వారిపై కేసులు
By Prajaswaram
On
మాసాయిపేట జనవరి 23 ( ప్రజాస్వరం) :
కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులు పెడుతున్నదని మాసాయిపేట సీనియర్ బీఆర్ఎస్ నాయకులు
చిట్టిమిల్లనాగరాజు మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీష్ రావు,ల పై సిట్ దర్యాప్తుకు పిలవడాన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నాయకత్వాన్ని అణచివేయాలనే కుట్రతో మాజీ మంత్రి హరీశ్ రావు, కేటీఆర్,లకు రేవంత్ సర్కార్ సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు చేసిన కుంభకోణాలు వెలికితీస్తున్నందుకే తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు అని విమర్శించారు. మంత్రుల పంచాయితీలను పక్కదారి పట్టించేందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
Latest News
04 Feb 2026 18:54:53
జిన్నారం, ఫిబ్రవరి 04(ప్రజాస్వరం): జిన్నారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ వార్డు సభ్యులతో విస్తృత స్థాయి ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి వార్డుకు...


