సరస్వతి మాత గౌతమ బుద్ధుడి, విగ్రహాలను ఆవిష్కరించిన

సరస్వతి మాత గౌతమ బుద్ధుడి, విగ్రహాలను ఆవిష్కరించిన

 అధికారులు... చిన్న శంకరంపేట జనవరి 21 (ప్రజా స్వరం):     చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002 2003 సంవత్సరపు 10వ తరగతి పూర్వ విద్యార్థులు బిపేట సిద్ధిరాములతో పాటు వారి సహచర విద్యార్థుల ఆర్థిక సహాయం సుమారు 3 లక్షల రూపాయల వ్యయం తో ఏర్పాటు చేసిన సరస్వతి మాత విగ్రహం, గౌతమ బుద్ధుని విగ్రహం, సభా వేదిక, నూట నలభై కుర్చీలను ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసిన విగ్రహాలను నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయి రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి విజయ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక సర్పంచ్ చిలుక నాగరాజు మండల విద్యాధికారి పుష్పవేని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయి రెడ్డిలతో కలిసి వాటిని ప్రారంభించారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి, వచ్చిన అతిథులను 2002 2003, 10వ తరగతి విద్యార్థులు శాలువా పూలమాలల తో ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి విజయతోపాటు అతిథులు మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అన్న విధంగా 2002 2003 సంబంధించిన పూర్వ విద్యార్థులు 21 మంది పాఠశాల అభివృద్ధి కోసం డబ్బులను కేటాయించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయమని పాఠశాల అభివృద్ధి కోసం ప్రధానోపాధ్యాయుడు చేసిన కృషి మరువలేనిదని వారన్నారు గత సంవత్సరం పదవ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని ఈ సంవత్సరం కూడా రాష్ట్రస్థాయిలో ర్యాంకు వచ్చే విధంగా కృషి చేయాలని వారు కోరారు. ఈ పాఠశాలలో చదువుకున్న 21 మంది విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి సహకరించడం చాలా గొప్ప విషయమని వృత్తిరీత్యా ఎక్కడో ఉన్న తాము చదువుకున్న పాఠశాలను గుర్తించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని వారన్నారు వీరిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు చదువుకునే విద్యార్థులు సైతం మంచి ఉన్నత స్థాయికి ఎదిగి వారు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ మండల విద్యాధికారి పుష్పవేని, తూప్రాన్ మండల విద్యాధికారి సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ నాగరాజు, ఉపసర్పంచ్ మల్లేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయి రెడ్డి, 2002 2003 10వ తరగతి విద్యార్థులు సిద్ధిరాములు, అక్బర్, రంజిత్, వేణు, అశోక్, జ్యోత్స్నాశ్రీ, యాదగిరి, దివ్యశ్రీ,సుచిత్ర, ముబీనా బేగం, కృష్ణ,