ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు...
చిన్న శంకరంపేట జనవరి 23 ( ప్రజాస్వరం ): నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు చిన్న శంకరంపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ బిజెపి మండల అధ్యక్షులు రాజులు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సమరయోధులను జైహింద్ నినాదంతో ప్రజలను ఉత్తేజ పరిచారని, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహా గొప్ప వ్యక్తి అని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు, ఘనంగా నిర్వహించడం జరిగింది స్వాతంత్ర ఉద్యమాన్ని ఉరవత లోగించి అహింస మార్గం కాకుండా పోరాటంతోనే స్వాతంత్రం వస్తుందని నమ్మి పోరాటాలను ప్రారంభించిన గొప్ప వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆజాద్ హింద్ అనే సంస్థను స్థాపించి జైహింద్ అనే నినాదం తీసుకువచ్చి జపాన్, రష్యా, సింగపూర్, వంటి దేశాలలో తిరిగి అక్కడి జైల్లో ఉన్న భారతీయులను తీసుకువచ్చి అజాద్ హింద్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ బిజెపి మండల అధ్యక్షులు రాజు, వెంకట్ గౌడ్, బలరాంరెడ్డి, శ్రీమన్నారాయణ, అశోక్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.


