కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన

మెదక్ ఎమ్మెల్యే...

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన

చిన్న శంకరంపేట జనవరి 22 ( ప్రజాస్వరం ):                        పేదోడి సొంతింటి కల నెరవేరాలని ఉద్దేశంతో ప్రతి గ్రామంలో పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని, పేదోడు సైతం సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పథకం ద్వారా ఉచితంగా బియ్యం అందించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనoపల్లి రోహిత్ అన్నారు, చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తోపాటు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు అనంతరం ఆయన చేతుల మీదుగా చెక్కులను అందజేశారు, మండలంలోని 46 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులతో పాటు 28 మంది లబ్ధిదారులకు వివిధ ఆసుపత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధి కి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలలో మెదక్ నియోజకవర్గ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఏ గ్రామంలో కూడా పేదవారికి ఇండ్లు నిర్మించి ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండు సంవత్సరాలలో ప్రతి గ్రామానికి పేదోడి సొంతింటి కల నెరవేరాలని ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మించుకునేందుకు నిధులు కూడా విడుదల చేయడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మదనపల్లి రోహిత్ అన్నారు రామాయంపేట మండల కేంద్రంలో 200 కోట్ల నిధులు వెచ్చించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మించడం జరుగుతుందని ఆయన అన్నారు, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ముందుకు సాగుతున్నామని పది సంవత్సరాల పాలనలో మాజీ ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఏడుపాయల దుర్గామాతను దర్శించుకోలేదని మెదక్ చర్చి కూడా రాలేకపోయాడని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మెదక్ చర్చి తో పాటు ఏడుపాయల దుర్గామాత అమ్మవారిని దర్శనం చేసుకొని అభివృద్ధి కోసం 35 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటయ్యాక 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మాలతి డిప్యూటీ తహసిల్దార్ ప్రభుదాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సర్పంచులు మోహన్ నాయక్, పుల్లారావు, ప్రవీణ్ కుమార్, సంతోషా నవీన్ కుమార్, సునీత యాదగిరి, అశోక్ నాయక్, నాయకులు మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, యాదవరావు, రాజిరెడ్డి, మనోజ్ కుమార్,గడిల సుధాకర్, తిగుళ్ల బిక్షపతి,శివకుమార్, శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్ రెడ్డి,రాజ్ కుమార్ గౌడ్, తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.