పేదల పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 

పేదల పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 

తాండూరు,జనవరి 21(ప్రజా స్వరం):                            వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం 

 పెద్దెముల్ మండలం కందనెల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకానికి మద్దతుగా, వీబీ జీరాంజీ పథకానికి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో , తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

2005 లో యూ పీ ఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ , అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పేదరికాన్ని తగ్గించడానికి, పేదల సంక్షేమం కోసం, పేదలు రెండు పూటల అన్నం తినాలనే ఉద్దేశంతో, బొంబాయి వలసలు తగ్గించడానికి 100% కేంద్ర నిధులతో ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.

మన ఉమ్మడి జిల్లాలో చేవెళ్ల లోని ఆలూరు దగ్గర ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా పథకాన్ని నిర్వీర్యం చేయాలనే మహాత్మా గాంధీ గారి పేరుతో ఉన్న చట్టాన్ని మార్చి జీ రామ్ జీ చట్టాన్ని తీసుకు వచ్చింది అని విమర్శించారు.

2020 కోవిడ్ వచ్చిన సమయంలో దేశంలో అన్ని పరిశ్రమలు మూతపడ్డ సమయంలో పల్లెల్లో ప్రజలకు ఉపాధి కల్పించింది పథకం.

100% కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న పథకాన్ని 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని పెట్టి పథకానికి తూట్లు పొడుస్తుంది బీజేపీ ప్రభుత్వం అని అన్నారు.

పెదోన్ని కొట్టి పెద్దలకు పెడుతుంది బీజేపీ.

పేదోడి కోసం కాంగ్రెస్ పని చేస్తుంది, పెద్దోడి కోసం బీజేపీ కష్టపడుతోంది.

రైతు వ్యతిరేకంగా తెచ్చిన రైతు నల్ల చట్టాలు ఏ విధంగా ఐతే రద్దు చేశారో అదేవిధంగా గ్రామీణ పేదలకు వ్యతిరేకంగా ఉన్న జీ రామ్ జీ చట్టాన్ని కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం.

చట్టాన్ని రద్దు చేసేంత వరకు పోరాటం చేద్దాం అని అన్నారు.

గ్రామ సభల్లో ఈ పథకాన్ని రద్దు చేయాలని తీర్మానం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు ధారసింగ్ గ, పెద్దేముల్ మండల ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్, నాయకులు పాల్గొన్నారు.