మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం ఖాయం...  

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ర్యాకల శేఖర్ గౌడ్

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం ఖాయం...  

మనోహరాబాద్ (ప్రజాస్వరం) : 

అమలు కానీ హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె నెక్కిందని పరిపాలన చేతకాకే ప్రజల దృష్టిని మరల్చడానికి బీఆర్ఎస్ నాయకుల పై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టాలని చూస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పార్టీ రాష్ట్ర నాయకులు ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మనోహరాబాద్ మండల కేంద్రంలో పురం మహేష్ , లతో కలిసి ఆయన మాట్లాడుతూ హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్  లపై తప్పుడు కేసులు పెడుతూ విచారణ పేరుతో వేదిస్తుందని అవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దానిపై దృష్టి పెట్టాలి కానీ ప్రతిపక్ష నాయకుల పై కేసులు పెట్టడం లాంటి చర్యలను మానుకోవాలని కేసులు పెట్టి మున్సిపల్ ఎన్నికలను గెలవాలనుకునే రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఆ పార్టీని వదిలేసి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రజలు ఎవరు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని 75% మున్సిపల్ లను బీ ఆర్ ఎస్ పార్టీ కైవసం చేసుకుని మున్సిపల్ ల పై జెండాలను ఎగురవిస్తామని ఆయన పేర్కొన్నారు. కాబోయే ఎంపిటిసి , జెడ్పిటిసి ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ సత్తా చాటుతుందని రాష్ట్రంలోని అన్ని జెడ్పిటిసులను కూడా కైవసం చేసుకుంటామని ఆయన తెలిపారు. తిరిగి కెసిఆర్ పాలన ను తెచ్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోగస్ ప్రచారాలను మానేసి తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ చూపిన బాటలో అభివృద్ధిని చేసి ప్రజలకు న్యాయం చేయాలి తప్ప ప్రతిపక్షాలపై బురద పూసే తప్పుడు ప్రచారాలను మానుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు పురం మహేశ్వర్ ముదిరాజ్,  మనోహరాబాద్ గ్రామ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్... వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...
13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం.... 
తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 
అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...
14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...