బొల్లారం నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు — వివేక్ వెంకటస్వామికి సన్మానం
బొల్లారం, జనవరి 23(ప్రజాస్వరం):
జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి బొల్లారం డివిజన్ నుంచి మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.
ఎన్‌ఎస్‌ఆర్ గార్డెన్లో జరిగిన ఈ సమావేశానికి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, నియోజకవర్గ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాండిడేట్ నీలం మధు ముదిరాజు హాజరయ్యారు. చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వీరిని ఘనంగా సన్మానించారు.
పార్టీ శ్రేణులకు మంత్రి వివేక్ మున్సిపల్ ఎన్నికలపై దిశా నిర్దేశం చేస్తూ, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గత దశాబ్ద కాలంలో బీఆర్‌ఎస్ పాలనలు చేసిన మోసాలు, అవినీతిని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు.
కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ నిర్మల జగ్గారెడ్డి, లక్ష్మా రెడ్డి, మాజీ కౌన్సిలర్ చంద్రయ్య, రాజ్ గోపాల్, వెంకటయ్య, చక్రపాణి, భాస్కర్, బషీర్, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


