బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం .... 

బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం .... 

తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) :

తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు...

భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన వార్డు ఇంచార్జ్ మల్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ధీమా. 

తూప్రాన్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో గురువారం వార్డు ఇన్చార్జ్ మల్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో అభ్యర్థి పోతరాజు రచనా ధనరాజ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తూప్రాన్ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఓటరుకు వివరించారు. అలాగే ప్రతి ఇంటికి కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి హామీలతో గద్దెనెక్కి గతంలో ఉన్న సంక్షేమ పథకాలకు తిలోదకాలు ఇచ్చిందన్నారు. గడచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి లు బలపరిచిన 14వ వార్డు అభ్యర్థి పోతరాజు రచనా ధనరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ఓటర్లను ఇన్చార్జి ఆంజనేయులు గౌడ్ శివంపేట మాజీ ఎంపీపీ హరికృష్ణ లు కోరారు.

కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు శ్రీకాంత్, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం ....  బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం .... 
తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు......
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసింది..
తూప్రాన్ 16వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం భారీ ర్యాలీ...  
న్యాయవాది స్వప్నను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి...
డిసిసి పై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు...
తూప్రాన్ గీతా విద్యా సంస్థలకు అంతర్జాతీయ అవార్డు ...
సామాన్య భక్తులే విఐపిలు మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలి ...