తూప్రాన్ గీతా విద్యా సంస్థలకు అంతర్జాతీయ అవార్డు ...

తూప్రాన్ గీతా విద్యా సంస్థలకు అంతర్జాతీయ అవార్డు ...

తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం ):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

తూప్రాన్ గీతా విద్యా సంస్థలకు

 అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్ దక్కింది.దుబాయిలో జరిగిన అంతర్జాతీయ విద్యా సదస్సు-2026 లో గీతా విద్యా సంస్థల చైర్ పర్సన్ పి. ఉష, డైరెక్టర్ పి.భరత్ లు ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పి.రామాంజనేయులు మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య, సురక్షితమైన వాతావరణం ,అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ,విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రాధాన్యతనిస్తూ అత్యాధునిక మౌలిక సదుపాయాలు ,క్రమశిక్షణ ,నైతిక విలువలు ,సాంకేతికను ఉపయోగించడం మరియు విద్యార్థి తల్లిదండ్రులతో బలమైన అనుబంధం కలిగి ఉండడం అనే ప్రధాన అంశాలను కలిగి ఉన్న విద్యాసంస్థలుగా గీతా విద్యాసంస్థలకు ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ -2026 అవార్డ్ దక్కిందన్నారు.

33 ఏళ్లుగా ఎంతో నిబద్ధతతో విలువ ఆధారిత విద్యను అందిస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు బి.రాఘవేందర్ గౌడ్ , కె.నారాయణ గుప్త, పి.మౌనిక, ప్రిన్సిపాల్ రజనీష్ గౌతమ్ , ఇంచార్జి ప్రిన్సిపాల్ ప్రేమ్ రాజ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్ మరియు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.

Latest News

బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం ....  బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం .... 
తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు......
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసింది..
తూప్రాన్ 16వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం భారీ ర్యాలీ...  
న్యాయవాది స్వప్నను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి...
డిసిసి పై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు...
తూప్రాన్ గీతా విద్యా సంస్థలకు అంతర్జాతీయ అవార్డు ...
సామాన్య భక్తులే విఐపిలు మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలి ...