సరస్వతీ శిశు మందిర్ లో ఘనంగా వసంత పంచమి సామూహిక అక్షరాభ్యాస వేడుకలు

సరస్వతీ శిశు మందిర్ లో ఘనంగా వసంత పంచమి సామూహిక అక్షరాభ్యాస వేడుకలు

ఆదిలాబాద్ జిల్లా జనవరి 23 (ప్రజాస్వరం):

ఇచ్చోడ మండల కేంద్రము లోని స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల లో సామూహిక అక్షరాభ్యాస వేడుకలు ఘనంగా నిర్వహించారు.వేద పండితులతో హోమం నిర్వహించి చిన్నారులకు సామూహిక అక్షర శ్రీకారం చేయించారు.ముఖ్య వక్తగా పాల్గొన్న విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ బొడ్డు బోజన్న గారు మాట్లాడుతూ సరస్వతీ అమ్మవారి జన్మదినమైన ఈ వసంత పంచమి రోజున బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు ఈ రోజే విద్యా బుద్దులు నేర్చుకొనుటకు శ్రీకారం పొందారని ఇలాంటి ప్రత్యేకమైన పుణ్య దినాన అక్షరాభ్యాసం చేయించు కొన్న వారికి విద్యా బుద్దులు సరస్వతీ దేవి కృపా,కటాక్షాలు పొందుతారని అన్నారు.వేద మంత్రాలతో హోమము నిర్వహించిన అనంతరం 3 నుండి 5 సంవత్సరాల పిల్లలకు వేద పండితులు గౌతమ్ దేశ్ పాండే గారు అక్షరాభ్యాసం చేశారు.35 మంది చిన్నారులకు అక్షరభ్యాసం చేయించారు. ఆధ్యాత్మికవేత్త మిట్టపల్లి శంకరయ్య,పాఠశాల కమిటీ సభ్యులు రాజేందర్,సుదర్శన్, ప్రధానాచార్యులు సంతోష్ కుమార్ ఆచార్యులు భారతి,ఉషారాణి,సుజాత,మంజుల,శంకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం ....  బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం .... 
తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు......
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసింది..
తూప్రాన్ 16వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం భారీ ర్యాలీ...  
న్యాయవాది స్వప్నను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి...
డిసిసి పై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు...
తూప్రాన్ గీతా విద్యా సంస్థలకు అంతర్జాతీయ అవార్డు ...
సామాన్య భక్తులే విఐపిలు మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలి ...