డిసిసి పై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు...

డిసిసి పై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు...

బీఆర్ఎస్ అభ్యర్థిని మల్లారెడ్డి బక్రను చేశాడు అనడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు

మేడ్చల్, ఫిబ్రవరి 5(ప్రజాస్వరం):                                     

ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం 6వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం 

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేశం రాణి నారాయణ గౌడ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భర్తను కురకుల రమేష్ ను బకరాను చేయడానికి ఎన్నికల బరిలో దింపారని అన్నారు.దీంతో ప్రచారం నిర్వహిస్తున్న పక్కనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి భర్త కురకుల రమేష్,మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్,మాజీ సర్పంచ్ మండల లక్ష్మీనారాయణ నాయకులు రాజు,పవన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో ఇరువురు నాయకుల మధ్య మాటలు యుద్ధం కొనసాగింది.డీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాజాబొల్లారం గ్రామంలో తిరగనీయబోమని వజ్రేష్ యాదవ్ ను హెచ్చరికలు జారీ చేశారు.కౌన్సిలర్ అభ్యర్థి భర్త దేశం నారాయణ గౌడ్ ఏముఖం పెట్టుకొని రాజబొల్లారం గ్రామంలో తిరుగుతున్నాడని ప్రశ్నించారు.

Latest News

బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం ....  బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం .... 
తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు......
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసింది..
తూప్రాన్ 16వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం భారీ ర్యాలీ...  
న్యాయవాది స్వప్నను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి...
డిసిసి పై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు...
తూప్రాన్ గీతా విద్యా సంస్థలకు అంతర్జాతీయ అవార్డు ...
సామాన్య భక్తులే విఐపిలు మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలి ...