న్యాయవాది స్వప్నను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి...
చెన్ రాజ్...
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి...
న్యాయవాద సంఘాల డిమాండ్
గజ్వేల్, ఫిబ్రవరి 05 (ప్రజాస్వరం):
మహిళ న్యాయవాది స్వప్నను అతి దారుణంగా, కిరాతకంగా దాడి చేసి హత్య చేసిన దుండగలను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గజ్వేల్ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చెన్ రాజ్ పండరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడికి పాల్పడుతూ నడిరోడ్డుపై వారిని దారుణంగా హతమారుస్తున్నా, ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురాకపోవడం పట్ల వారు విచారాన్ని వ్యక్తపరిచారు. ఇకనైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని వారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కోర్టు విధులను న్యాయవాదులు బహిష్కరించాలని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ రోజు గజ్వెల్ కోర్ట్ లో కూడా న్యాయవదులందరు విధులను బహిష్కరించడం జరిగింది.


