ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసింది..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసింది..

కాలేశ్వరం కాలువ ద్వారా బిఆర్ఎస్ లక్షల కోట్లు దోచుకుంది...

రామాయంపేట, ఫీబ్రవరి 05 ( ప్రజాస్వరం ):


రామాయంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రఘునందన్ రావు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు, రామాయంపేట బైపాస్ నుండి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభలో పాల్గొన్నారు, రామయంపేట పట్టణానికి చెందిన బాపురెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరడంతో ఆయనకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు, ప్రచార కార్యక్రమానికి హాజరైన మెదక్ ఎంపీ రఘు నందన్ రావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లను రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు సత్యనారాయణ గుప్త రామాయంపేట పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డిలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదని అన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూమి విక్రహించి డబ్బులు దోచుకుంటుందని మండిపడ్డారు. రామాయంపేట మున్సిపల్ పట్టణం 1985 నుండి నేటి వరకు అంతే ఉందని ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని మున్సిపల్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను గెలిపిస్తే రామాయంపేట బైపాస్ రోడ్డు నుండి దామరచెరువు వరకు డివైడర్లు ఏర్పాటు చేసి సెంట్రల్ లైటు ఏర్పాటు చేస్తామని వారు అన్నారు, అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ సిద్దిపేట కోమటి చెరువును ఖర్చు చేసి అభివృద్ధి చేశారు రామాయo పేట ను దత్తత తీసుకొని మల్లెచెరువుకు 10 కోట్లు కూడా కేటాయించలేదని రామాయంపేట ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను బిఆర్ఎస్ నాయకులు బెదిరింపులకు గురిచేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, ఇటికతో కొడితే గన్నేటి రౌతుతో కొడతామని, గల్లి నుంచి ఢిల్లీ వరకు తరిమి కొడతామని బెదిరింపులు మానుకోవాలని ఆయన హెచ్చరించారు, గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల పై ఉన్న ప్రేమ మెదక్ నియోజకవర్గంపై ఎందుకు లేదని, మండిపడ్డారు, పద్మాదేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి రామాయంపేట ను ఏలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్, బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, వెలుముల సిద్ధిరాములు, రామాయంపేట పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి, లక్ష్మాపూర్ సర్పంచ్ నవీన్ గౌడ్, పబ్బా సత్యనారాయణ గుప్తా, గోపిశెట్టి రమణ గుప్తా, చింతల శేఖర్, తో పాటు బిజెపి బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం ....  బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం .... 
తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు......
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసింది..
తూప్రాన్ 16వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం భారీ ర్యాలీ...  
న్యాయవాది స్వప్నను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి...
డిసిసి పై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు...
తూప్రాన్ గీతా విద్యా సంస్థలకు అంతర్జాతీయ అవార్డు ...
సామాన్య భక్తులే విఐపిలు మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలి ...