ఎరువుల పత్రం పంపిణీ ప్రారంభం 

ఏవో రాజనారాయణ 

ఎరువుల పత్రం పంపిణీ ప్రారంభం 

రామాయంపేట. జనవరి.22 ( ప్రజాస్వరం ):

 మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో పంట వేసిన ప్రతి రైతుకు మరియు తమ విస్తీర్ణం ఆధారంగా ఎరువుల పంపిణీ పాదదర్శకంగా పంపిణీ లక్ష్యంగా ఎరువుల పంపిణీ పత్రాల ద్వారా ఎరువులను ముఖ్యంగా యూరియా పంపిణీ ఈరోజు ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ, "ఇప్పటి నుండి యూరియా కావాల్సిన రైతులు తప్పనిసరిగా ఎరువుల పంపిణీ పత్రం కలిగి ఉండాలి. ఈ పత్రం ద్వారా మాత్రమే ఎరువుల పంపిణీ చేయబడుతుంది" అని తెలిపారు. రైతులు ఎరువుల పంపిణీ పత్రం తీసుకొని, యాసంగి సీజన్‌లో వేసిన పంట విస్తీర్ణం వివరాలు ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌తో పాటు నమోదు చేసుకొని, వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారి ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించారు.వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ఈ విధానం గురించి అవగాహన కల్పించడం జరిగింది.మరిన్ని వివరాలకు మండల వ్యవసాయ అధికారిని సంప్రదించండి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు