గ్రామీణ క్రీడా కారులను వెలికితీయడమే సి ఎం కప్ లక్ష్యం...

గ్రామీణ క్రీడా కారులను వెలికితీయడమే సి ఎం కప్ లక్ష్యం...

 మాసాయిపేట (ప్రజాస్వరం) :

గ్రామీణ స్థాయిలో ఉన్న మట్టి లో మాణిక్యాలాంటి క్రీడాకారులను వెలికితీసి వారి ప్రతిభను ప్రపంచ స్థాయి కి పరిచయం చేసే ఉద్దేశం తో తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సి ఎం కప్ 2025 లో భాగంగ మాసాయిపేట గ్రామ స్థాయి క్రీడలను మాసాయిపేట గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ శ్రీ వీరన్నగారి కృష్ణా రెడ్డి వాలీబాల్ క్రీడలను సర్వీస్ చేసి ప్రారంభించారు. గ్రామ స్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేలా చేయడానికి ఇలాంటి క్రీడలు ఉపయోగపడతాయని శ్రీ కృష్ణ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమం లో గ్రామ ఉప సర్పంచ్ శ్రీ పసుల వెంకటేష్ ,వార్డు సభ్యులు,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,క్రీడాకారులు,అధికారులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.