మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ — ముఖ్య కార్యకర్తల సమావేశం
పటాన్‌చెరు, జనవరి 23(ప్రజాస్వరం):
రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డ పోతారం మున్సిపాలిటీల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను బలంగా ముందుకు తీసుకెళ్లడమే పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇంచార్జి నీలం మధు, గాలి అనిల్ కుమార్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


