పరేడ్ రిహార్సల్స్ పరిశీలించిన అదనపు ఎస్పీ....
By Prajaswaram
On
మెదక్ జనవరి 25 (ప్రజాస్వరం):
గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్‌లో పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఈ రిహార్సల్స్ ను జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. పరేడ్‌లో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ తో పాల్గొన్నారు. కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు, భద్రతా ఏర్పాట్ల పై ఆయన మార్గదర్శకాలు అందించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, రంగా నాయక్, సీఐ జార్జ్, ఆర్‌ఐ శైలేందర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Latest News
05 Feb 2026 20:10:00
తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు......


