గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా...
ప్రవంతి విజయ్ కుమార్
తూప్రాన్, జనవరి 25 (ప్రజాస్వరం):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల లో 16వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయడానికి బుక్క ప్రవంతి విజయ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా ఆమె 16వ వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా 16 వ వార్డులో సిసి రోడ్లు డ్రైనేజ్ పనులు స్వయంగా ఉండి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేశానని ఆమె అన్నారు అభివృద్ధి ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
వార్డులో నెలకొన్న మౌలిక వసతులు సమస్యలు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం, వీధి దీపాలు, పేదల సంక్షేమం వంటి అంశాలను ఆమె అంతిమ లక్ష్యంగా గుర్తించి, వారి పరిష్కారానికి నిరంతరంగా పనిచేస్తానని స్రవంతి విజయ్ కుమార్ తెలిపారు.
ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని, అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి సమర్థవంతంగా పరిష్కరిస్తానని ఆమె తెలిపారు
ప్రజల సహకారం, . రాబోయే కౌన్సిలర్ ఎన్నికల్లో తమను గెలిపించి ఆశీర్వదించాలని 16వ వార్డు ప్రజలను ఆమె విజ్ఞప్తి చేశారు.


