ఎల్లవ్వ మృతికి బాదిత కుటుంబానికి ఆర్థిక సాయం....
By Prajaswaram
On
దౌల్తాబాద్ జనవరి25( ప్రజాస్వరం):
మండల పరిధిలోని మాచినపల్లి గ్రామంలో ఇటీవల నరమైన ఎల్లవ్వ మృతి చెందడంతో ఆమె కుటుంబానికి దుద్దెడ స్వామి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం నాడు ఎల్లవ్వ కుటుంబానికి రూ.2,000/- నగదు సహాయంతో పాటు 25 కిలోల బియ్యాన్ని అందించారు.
ఈ సందర్భంగా దుద్దెడ స్వామి మాట్లాడుతూ, ఇలాంటి కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఎల్లవ్వ కుటుంబానికి మాచినపల్లి గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఆయన కోరారు. గ్రామస్తుల సహకారంతోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించగలుగుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొని బాయిత కుటుంబానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
Latest News
06 Feb 2026 20:57:57
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...


