కాంగ్రెస్ లో చేరిన సంగాయపల్లి సర్పంచ్ గంగాధర్....
చిన్న శంకరంపేట జనవరి 23 ( ప్రజాస్వరం ): చిన్న శంకరంపేట మండలం సంగయ్య పల్లి గ్రామ సర్పంచ్ గంగాధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, గ్రామపంచాయతీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గంగాధర్ తో పాటు ఆరుగురు వార్డు సభ్యులు కృష్ణ కుమార్ నాగరాజు ప్రభాకర్ యాదగిరి నవీన్ లు ఎన్నికల్లో గెలుపొందారు, నేడు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి ఆయన పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సర్పంచ్ గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ సహకారంతో గ్రామాన్ని అని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు, గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ నిధులు కేటాయించాలని కోరారు, ఈ కార్యక్రమంలో సంగయిపల్లి సర్పంచ్ గంగాధర్, మాందాపూర్ తాండ సర్పంచ్ అశోక్ నాయక్, తో పాటు తోట కృష్ణ, కర్నే కుమార్, నాగరాజు, ప్రభాకర్, యాదగిరి, నవీన్, రాజిరెడ్డి, మనోజ్ కుమార్, తిగుళ్ల బిక్షపతి, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు


