ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ...

 ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ...

 చిన్న శంకరం పేట జనవరి 25 ( ప్రజాస్వరం ):                         ఓటు హక్కును వినియోగించుకోవడం ఒక హక్కు మాత్రమే కాదని దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి ఓటుకు ఉన్నదని ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తహశీల్దార్ మాలతి అన్నారు, చిన్న శంకరంపేట మండల కేంద్రంలో తహశీల్దార్ మాలతి ఆధ్వర్యంలో 16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం నుండి మెదక్ చేగుంట రహదారి గుండా స్థానిక బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు, జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని కార్యాలయం ముందు ముగ్గుల పోటీ నిర్వహించారు ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు, అదేవిధంగా నలుగురు సీనియర్ సిటిజన్లను గుర్తించి శాలువాలతో సన్మానం చేశారు, ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులకు జాతీయ ఓటర్ దినోత్సవ పెన్నులను తహశీల్దార్ మాలతి చేతుల మీదుగా అందజేశారు, ఈ సందర్భంగా తహశీల్దార్ మాలతి మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలాంటి ప్రలోభాల గురికాకుండా భయభ్రాంతులకు గురి కాకుండా తప్పకుండా తమ ఓటును వినియోగించుకోవాలని, నోట్ల కోసమో లిక్కర్ కోసమో ఓట్లను అమ్ముకోకూడదని ఆమె ఓటర్లకు సూచించారు, ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మాలతి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, జూనియర్ అసిస్టెంట్ శేషు, మధు, జిపిఓ లు ఎల్లము, మహేష్, రాజు, కవిత, గీత, బి ఎల్ ఓ లు నాగరాణి, మాలతి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం ....  బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం .... 
తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు......
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసింది..
తూప్రాన్ 16వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం భారీ ర్యాలీ...  
న్యాయవాది స్వప్నను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి...
డిసిసి పై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు...
తూప్రాన్ గీతా విద్యా సంస్థలకు అంతర్జాతీయ అవార్డు ...
సామాన్య భక్తులే విఐపిలు మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలి ...