మైత్రి ఫౌండేషన్‌తో సామూహిక అక్షరాభ్యాసాలు
By Prajaswaram
On
గుమ్మడిదల, జనవరి 23(ప్రజాస్వరం):
వసంత పంచమి సందర్భంగా గుమ్మడిదల ప్రాథమిక పాఠశాలలో మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసాలు ఘనంగా జరిగాయి. ఫౌండేషన్ చైర్మన్ చెన్నం శెట్టి మౌనిక ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో చిన్నారులతో అక్షరాభ్యాసాలు నిర్వహించారు.
వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సరస్వతీ మాత పూజ చేసి చిన్నారులకు అక్షరాలు దిద్దించారు. అనంతరం పలక, బలపం వంటి అక్షరాభ్యాస పూజ సామగ్రి పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తులసీదాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు, మాదనర్సింలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Latest News
05 Feb 2026 20:10:00
తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు......


