చిత్తారమ్మ ఆలయ అభివృద్ధికి కృషి...
మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి...
రామాయంపేట, జనవరి 25 ( ప్రజాస్వరం):
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని చిత్తారమ్మ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం చిత్తరమ్మ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. చిత్తరమ్మ వార్షిక బ్రహ్మోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కంటారెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మాజీ పిఏ సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, పుట్టి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.


