ఇంద్రేశంలో వైభవంగా మల్లన్న స్వామి జాతర

పాల్గొన్న కాటా శ్రీనివాస్ గౌడ్

ఇంద్రేశంలో వైభవంగా మల్లన్న స్వామి జాతర

ఇంద్రేశం, జనవరి 26(ప్రజాస్వరం):

ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జాతరలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులు ఆయనను అప్యాయంగా సన్మానించారు.

జాతర కార్యక్రమాన్ని ఉద్దేశించి కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 

ప్రజలపై భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. గ్రామాలు, సమాజం శాంతి,సమతా మార్గంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం అని చెప్పారు.

జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.