చైతన్యబాటలో టీఆర్‌పీలోకి భారీ చేరికలు...
తూప్రాన్, జనవరి 25:(ప్రజాస్వరం):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు హిమాం పూర్ యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న చైతన్యబాట కార్యక్రమంలో భాగంగా నార్సింగ్ మండలం భీమ్ రావు పల్లి గ్రామం, రామాయంపేట మండలం ఢీ ధర్మారం (ప్రగతి ధర్మారం) గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్‌పీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి టీఆర్‌పి జిల్లా నాయకులు పార్టీ కండువాలు కప్పి సాధారంగా స్వాగతించారు. పార్టీ
చైతన్యబాట కార్యక్రమం ద్వారా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, గ్రామస్థులు టీఆర్‌పి లో చేరారు , ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరఫున నిరంతరం పోరాడుతామని ఆయన తెలిపారు. గ్రామస్థులు టీఆర్‌పీ కార్యక్రమాలకు మంచి స్పందన వ్యక్తం చేస్తూ పార్టీలో చేరడం ఉత్సాహాన్ని కలిగించిందని నేతలు పేర్కొన్నారు.
రామాయంపేట మండలం ధర్మారం గ్రామంలోని టీ పాయింట్ వద్ద టీఆర్‌పి నాయకులు గ్రామస్తులతో చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యలు, రోడ్లు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై గ్రామస్తులు తమ సమస్యలను వివరించారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని టీఆర్‌పి నాయకులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర కార్యదర్శి బసాపురం నగేష్ ముదిరాజ్, మెదక్ జిల్లా అధ్యక్షులు ఇమాంపురం యాదగిరి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు కమలయ్య, సురేష్ ముదిరాజ్, చేగుంట మండల అధ్యక్షులు కంచర్ల సిద్దా గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ముదిరాజ్, జిల్లా కోశాధికారి మంకిడి రాములు ముదిరాజ్, అధికార ప్రతినిధి పగిడిమారి శేఖర్ నేత, జిల్లా యువత అధ్యక్షులు పోతుల రవీందర్, ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


