చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం
5 ఎకరాల్లో డంపింగ్ యార్డ్
పటాన్ చెరు, జనవరి 23(ప్రజాస్వరం):
అమీన్పూర్, పటాన్చెరు బల్దియా సర్కిళ్ల పరిధిలో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించినట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో అమీన్పూర్, పటాన్చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జిఎంఆర్‌కు అధికారులు చెత్త డంపింగ్ సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బల్దియా పరిధిలో మొత్తం తొమ్మిది డివిజన్ల చెత్త డంపింగ్ కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు చెప్పారు.
భూమి కేటాయింపు వచ్చే వరకు చెత్త నిర్వహణను ప్రస్తుతం రాంకీ సంస్థ ద్వారానే కొనసాగించేలా జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్‌ను కోరినట్లు తెలిపారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలో చెత్త డంపింగ్ మూలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారమే లక్ష్యమని చెప్పారు.
ఈ సమావేశంలో అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, పటాన్చెరు డిప్యూటీ కమిషనర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.


