టియూడబ్ల్యూజేయు సభ్యత్వ నమోదు ప్రారంభం.... 

టియూడబ్ల్యూజేయు సభ్యత్వ నమోదు ప్రారంభం.... 

మెదక్, జనవరి 26 (ప్రజాస్వరం):

తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ హెచ్ 69/2017/టిఎస్ మెదక్ జిల్లా జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మహ్మద్ రియాజుద్దీన్, జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇంతియాజుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ యూసుఫ్ అలి, జిల్లా ఉపాధ్యక్షులు సబ్దర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుజావుద్దీన్ ఇఫ్తెఖారీ ఆదేశాలతో సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ఉర్దూ జర్నలిస్టు యూనియన్ ఉర్దూ జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతుందని ఎక్కడైనా ఉర్దూ జర్నలిస్టులపై అన్యాయం జరిగితే టియూడబ్ల్యూజేయు పక్షాన పోరాడుతామని వెల్లడించారు. రాష్ట్రంలోనే ఏకైక ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు ట్రేడ్ యూనియన్ అయిన టియూడబ్ల్యూజేయు అని తెలిపారు.