పురాతన కలలను కాపాడుకోవాలి..

సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్

పురాతన కలలను కాపాడుకోవాలి..

చిన్నశంకరంపేట, జనవరి 25 (ప్రజాస్వరం):

చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నా గ్రామం నా వారసత్వం కార్యక్రమం చందంపేట గ్రామంలో సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్, ఉమామహేశ్వర భజన మండలి సభ్యులు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. సర్పంచ్ ప్రవీణ్ కుమార్ భజన మండలి సభ్యులు యాదగిరి, గంగాధర్ మాట్లాడుతూ చందంపేట గ్రామంలో 100 సం నుంచి యక్షగానం భాగవతం నిర్వహిస్తున్నామని, మహాశివరాత్రి, సంక్రాంతి, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో యక్షగాన కార్యక్రమాలు శావ నిర్వహణ, మరియు గ్రామంలో ఎవరైనా మరణిస్తే రాత్రి నుంచి ఉదయం వరకు భజన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అలాగే గ్రామంలో పురాతన బురుజు పలకవర్గం సభ్యులు, గ్రామస్తులు కలిసి పరిశీలించారు. సర్పంచ్ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గతంలో ఉన్నత అధికారులు బురుజు నలుమూలలు పరిశీలించి పర్యటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటివరకు మాటలు నీటి మూటల గడిచాయని ప్రస్తుత ప్రభుత్వం స్పందించి బురుజు అభివృద్ధి పరచాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పద్మ ,ఉపసర్పంచ్ నర్సింలు వార్డు సభ్యులు, భూపాల్, రామకృష్ణ, నర్సింలు, గౌతమి, లావణ్య, భజన మండలి సభ్యులు పెంట స్వామి సిద్ధిరాములు, రాములు, సంగయ్య, భూమయ్య, నారాయణ, పోచయ్య, లక్ష్మయ్య, కిష్టయ్య, నర్సింలు , పోచయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్... వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...
13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం.... 
తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 
అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...
14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...