విద్యాధారి క్షేత్రంలో వసంత పంచమి...

విద్యాధారి క్షేత్రంలో వసంత పంచమి...

స్వర్ణ కిరీటంతో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ విద్యాధరి 

60 వేలకు పైగా తరలివచ్చిన భక్తజనం 

6 వేలకు పైగా చిన్నారులకు అక్షర స్వీకారాలు 

గజ్వెల్ జనవరి 23 (ప్రజాస్వరం):

తెలంగాణ జిల్లాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో శుక్రవారం శ్రీ వసంత పంచమి వైభవం నెలకొంది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్, బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో శ్రీ పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి స్వామి వారి చేతులమీదుగా ఉత్సవానికి అంకురార్పణ జరగగా, అనంతరం అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, అమ్మవారి పల్లకి సేవ, లక్ష పుష్పార్చన, చెప్పన్ బోగ్ నివేదన, శ్రీ విద్యాజ్యోతి దివ్యదర్శనం తదితర వైభవంగా జరిగాయి. ఆధ్యాత్మిక వైభవం సంతరించుకోగా, 60 వేలకు మందికి పైగా భక్తులు శ్రీ విద్యాధరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సముదాయం భక్తులతో పోటెత్తగా, అమ్మవారి నామస్మరణతో మార్మోగిoది. ముఖ్యంగా అమ్మవారి సన్నిధిలో 6 వేలకు పైగా అక్షర స్వీకారాలు జరగగా, చదువుల తల్లి స్వర్ణ కిరీటoతో భక్తులకు దివ్యదర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం శ్రీ గురు మదనానంద పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ చేతులమీదుగా వేద విద్యార్థులకు జయ పట్టా ప్రధానం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆంక్షా రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి గుప్త తదితరులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించగా, విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలతో పాటు మహా ప్రసాదం అందజేశారు. మహోత్సవాన్ని పురస్కరించుకొని గజ్వేల్ ఏసిపి నర్సింలు, సీఐ రవిరాజు, ఎస్సై కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Latest News

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్... వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...
13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం.... 
తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 
అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...
14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...