మున్సిపల్ కార్యాలయం సందర్శించిన...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
తూప్రాన్, జనవరి 27 (ప్రజాస్వరం):
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. మాట్లాడుతూ తూప్రాన్ మున్సిపల్ లో 16 వార్డులు 32 పోలింగ్ స్టేషన్ లు ఆరుగురు రిటర్నింగ్ అధికారులు ఉంటారని మున్సిపల్ నామినేషన్ ప్రక్రియ మున్సిపల్ కార్యాలయంలోని ఉంటుందని ఆయన అన్నారు ఎన్నికల షెడ్యూలు ఎప్పుడు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు జిల్లాలో మెదక్. రామయంపేట్. తూప్రాన్.నర్సాపూర్. నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయని అందులో 75 వార్డులు 150 పోలింగ్ స్టేషన్ లు మున్సిపల్ కమిషనర్ లు అధికారులు పరిశీలించడం జరిగిందన్నారు కౌంటింగ్ కేంద్రాలు కూడా నిర్ణయించామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి మున్సిపల్ కమిషనర్ పాతూరు గణేష్ రెడ్డి మున్సిపల్ అధికారులు సిబ్బంది ఉన్నారు


