ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు...

మేడ్చల్ సిపిఐ ఇన్చార్జ్ తోటపల్లి శంకర్...

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు...

జవహర్ నగర్, ఫిబ్రవరి 8,(ప్రజాస్వరం):

 

ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి తోటపల్లి శంకర్ అన్నారు. ఆదివారం సిపిఐ కాప్రా మండల కౌన్సిల్ సమావేశం జవహార్ నగర్ దళిత సంక్షేమ భవన్లో కాప్రా మండల సిపిఐ కార్యదర్శి దర్శనం యాదగిరి అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయ ఆస్తులు మరియు అవసరమైన ప్రజా సేవల ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన లేబర్ కోడ్లను వ్యతిరేకంగా సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఫలితంగా ఉద్యోగాలు కోల్పోవడం కార్మిక హక్కులను హరించే వేయడం మరియు సామాజిక భద్రత నిరాకరణ యువత మరియు శ్రామిక ప్రజలకు తీవ్రంగా దెబ్బతీసిందన్నారు కష్టపడి సాధించుకున్న కార్మిక హక్కులను పలుచన చేసిన కార్మిక సంఘాలను బలహీనపరిచి వ్యాపారం చేయడం సులభతరం పేరుతో సంస్కగతమైన దోపిడీకి కారణమైన నాలుగు కార్మిక లేబర్ కోళ్లను వెంటనే రద్దు చేయాలని (సిపిఐ) ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తుందన్నారు ఈ లేబర్ కోడ్లు ఉద్యోగ భద్రత న్యాయమైన వేతనాలు మరియు సురక్షితమైన పని పరిస్థితులను అరిస్తున్నాయని ముఖ్యంగా యువకులకు కాంట్రాక్ట్ కార్మికులకు నష్టాదాయకమన్నారు .ఈ నెల 12న తలపెట్టిన దేశవ్యాప్త సాహిత్య సమ్మెలు నియోజకవర్గంలోని కార్మిక, ప్రజా సంఘాలు భారీ ఎత్తున మీ సమ్మెలో పాల్గొంటారని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నిమ్మల నరసింహులు, గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్యామల ,లత వి స్వరూప నాయక్, ఏఐటిసి మండల అధ్యక్షులు ఏ ఎల్లయ్య,గిరి ప్రసాద్ నగర్ సిపిఐ కార్యదర్శి కొండా సత్యం సాగర్, రైతు సంగం నాయకులు పి నరసింహ, మహిళా సమైక్య నాయకురాలు డి మల్లిక, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు... ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు...
జవహర్ నగర్, ఫిబ్రవరి 8,(ప్రజాస్వరం):   ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి తోటపల్లి...
యావపూర్ హరిజనవాడ లో మహేష్ బోర్ మోటార్ పంపిణి.. 
13 వ వార్డు ప్రచారంలో దూసుకెళ్తున్నా సింహం... 
యావపూర్ లో స్వచ్ఛభారత్ ....
ప్రభుత్వ స్థలం కాదు... ప్రైవేట్ భూమి.....
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం మంత్రి అజారుద్దీన్..
గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి.....