పటాన్ చెరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ శంకుస్థాపన కు హాజరైన మంత్రులు పొంగులేటి, వివేక్

పటాన్ చెరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ శంకుస్థాపన కు హాజరైన మంత్రులు పొంగులేటి, వివేక్

ఘన స్వాగతం పలికిన నీలం మధు ముదిరాజ్..

పటాన్ చెరు, జనవరి 28(ప్రజాస్వరం):

పటాన్ చెరు లోని కర్ధనూర్ లో నూతనంగా నిర్మించతలపెట్టిన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి హాజరయ్యారు. మార్గమధ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మంత్రులిద్దరికి మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ ఘన స్వాగతం పలికారు. ఇద్దరికి పూల బొకేలు అందించి శాలువలు కప్పి సత్కరించారు. పటాన్ చెరు కు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరు చేయడంతో పాటు కర్ధనుర్ లో స్థల కేటాయింపు చేసి భవన నిర్మాణం పనులు మొదలు పెడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సబ్ రిజిస్టర్ కార్యాలయ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు ప్రయాణ భారం తగ్గడంతో పాటు సమయం రవాణా ఖర్చులు కలిసి వస్తాయని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్నందుకు నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..

Latest News

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు... ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు...
జవహర్ నగర్, ఫిబ్రవరి 8,(ప్రజాస్వరం):   ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి తోటపల్లి...
యావపూర్ హరిజనవాడ లో మహేష్ బోర్ మోటార్ పంపిణి.. 
13 వ వార్డు ప్రచారంలో దూసుకెళ్తున్నా సింహం... 
యావపూర్ లో స్వచ్ఛభారత్ ....
ప్రభుత్వ స్థలం కాదు... ప్రైవేట్ భూమి.....
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం మంత్రి అజారుద్దీన్..
గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి.....