మున్సిపల్ ఎన్నికల్లో భారాస దే గెలుపు
మాజీ మంత్రి హరీష్ రావు
తూప్రాన్ జనవరి 26 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భారాస మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని చైర్మన్ పదవి గెలవడం ఖాయమని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సోమవారం సిద్దిపేట క్యాంపు ఆఫీస్ లో తూప్రాన్ 5. 16వ వార్డులకు చెందిన యువకులు ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో గతంలో తరహాలోనే తిరిగి అన్ని చోట్ల బిఆర్ఎస్ జండా ఎగరవేయడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పై రెండేళ్ల కాలంలో ప్రజలకు తీవ్రమైన వ్యతిరేకత ఉందనీ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని హరీష్ రావు దుయ్యబట్టారు. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల విఫలమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నాయకులు కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగి పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, ఎన్నికల్లో మాత్రం గట్టి అభ్యర్థులను బరిలో నిలుపుతామన్నారు. కార్యక్రమంలో తూప్రాన్ పురపాలక ఇన్చార్జ్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, మామిండ్ల అనిల్, 5, 16 వార్డుల అధ్యక్షులు శ్రీకాంత్ చారి బందెల నరేష్, బ్రాహ్మణపల్లి గణేష్ రెడ్డి యువకులు ఉన్నారు.
భారాసలో యువకుల చేరిక..
మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో తూప్రాన్ చెందిన యువకులు పెద్ద సంఖ్యలో సోమవారం భారాసలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుడు బుక్క విజయ్ కుమార్ బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. 16 వ వార్డులో టికెట్ ఎవరికీ ఇస్తే వారిని గెలిపిస్తామని విజయకుమార్ యువకులు పేర్కొన్నారు.


