13 వ వార్డు ప్రచారంలో దూసుకెళ్తున్నా సింహం...
తూప్రాన్, ఫిబ్రవరి 8( ప్రజాస్వరం ):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు అభ్యర్థి డాక్టర్ జానకిరామ్ ఆల్ ఇండియా ఫెడరేల్ బ్లాక్ జాగృతి కవిత పార్టీ బలపరిచిన అభ్యర్థి సింహం గుర్తుకు ఓటు వెయ్యాలని తెలంగాణ రాష్ట్ర నాయకులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ ప్రచారం లో పాల్గొన్నారు సింహం గుర్తు తో ప్రచారం లో మహిళ లు భారీగా ర్యాలీ బతుకమ్మ అట పాటలు దుసుకెళ్లుతున్నారు జానకిరాం మాట్లాడుతూ "బ్యాలెట్ బుల్లెట్‌కంటే శక్తివంతమయినది" అనే నినాదంతో ఓటు వేసే ప్రజలను ఉద్దేశించిఆయన మాట్లాడుతున్నారు.
ప్రజాస్వామ్యం అనేది ఓటు వేయడమే కాదు, గౌరవంగా జీవించే హక్కు కూడా జానకిరామ్ ప్రజలను తమ గొంతుక వినిపించడానికి, సమస్యలు పరిష్కరించడానికి ఓటు వేయాలని కోరుతున్నారు.
ఓటు శక్తి ఓటు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దానిని సరైన దిశలో వినియోగించాలనిఆయన వివరించారు.
తనకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ముమ్మర ప్రచారం చేస్తున్నారు.
ఈ ప్రచారంలో ప్రజలను ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు.ఈ కార్యక్రమం లో ఓయూ నుండి నాయకులు హర్ష వర్ధన్ గౌడ్ హన్మంత్ గౌడ్ తలారి సతయ్య కృష్ణ గౌడ్ చిరంజీవి పూర్ణరాజు తదితరులు పాల్గొన్నారు


