సాయిపేట శ్రీనివాస్ ప్రత్యేక పూజలు
By Prajaswaram
On
మేడ్చల్ / గుండ్లపోచంపల్లి (ప్రజాస్వరం) ;
గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలోని ఆర్కల్ గూడ లోని హనుమాన్ ఆలయం మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ హనుమాన్ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్కల్ గూడ గ్రామ ప్రజలందరూ ఎప్పుడూ, సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని ప్రతి ఒక్కరికీ ఆ హనుమాన్ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు...
ఈ కార్యక్రమంలో గుండ్ల పోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్, బాపిరెడ్డి, రవితేజ, రాజు,గుండ వినోద్, తదితరులు పాల్గొన్నారు.
Latest News
07 Feb 2026 21:32:18
మేడ్చల్, ఫిబ్రవరి 07 (ప్రజాస్వరం): జిహెచ్ఎంసి మేడ్చల్ డివిజన్లోని సర్వే నంబర్ 1045/1 లోని స్థలాన్ని కొందరు రియేటర్లు కబ్జా చేశారని, స్థానిక ఉమా వెంకట్ రెడ్డి...


