ప్రిన్సిపాల్ సురేఖ కు మూడవసారి ప్రశంసా పత్రం ...
మెదక్ జనవరి 26 (ప్రజాస్వరం) :
భారత గణతంత్ర దినోత్సవాన్ని మెదక్ జిల్లాలో ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రతిభావంతులను సత్కరించగా, తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల, మెదక్ ప్రిన్సిపల్ ఆర్ సురేఖ తమ ఉత్తమ సేవలకు గాను “ఉత్తమ సేవల అవార్డు” మరియు ప్రశంస పత్రంను అందుకున్నారు. ఈ అవార్డు మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ మరియు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వారి చేతుల మీదుగా ప్రదానం చేశారు. వరుసగా మూడవసారి ప్రశంస పత్రాలను అందుకున్న ఆర్ సురేఖ , ప్రిన్సిపల్ ఆర్ సురేఖ విద్యా రంగంలో చూపిన అంకితభావం, క్రమశిక్షణతో కూడిన సేవలను, మైనారిటీ విద్యార్థుల విద్యాాభివృద్ధికి చేసిన నిరంతర కృషిని గుర్తించి జిల్లా యంత్రాంగం ఈ గౌరవాన్ని అందజేసింది. కళాశాలలో విద్యా ప్రమాణాలు పెంపొందించడం, వారి భవిష్యత్తుకు దోహదపడే విధంగా మార్గనిర్దేశం చేయడంలో ఆమె పాత్ర విశేషమని ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు.
అవార్డు అందుకున్న అనంతరం ప్రిన్సిపల్ ఆర్ సురేఖ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను పెంచిందని, విద్యార్థుల అభివృద్ధి కోసం ఇంకా కష్టపడి పనిచేస్తానని తెలిపారు. ఈ అవార్డు తన ఒక్కడి కృషి ఫలితం కాదని, కళాశాల సిబ్బంది, అధ్యాపకులు మరియు విద్యార్థుల సమిష్టి సహకారంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు.


