ఉపాధి హామీ పథకం ముద్దు, వీబి జీ రాం జీ చట్టం వద్దు.....
చిన్న శంకరంపేట, జనవరి 27 ( ప్రజాస్వరం): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన నిర్వహించే నిరసన కార్యక్రమ పత్రికను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ చిన్న శంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాన సత్యనారాయణ లు విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో దేశంలో ఉన్న వలస కూలీల కోసం వీధిన పడ్డ కుటుంబాలను దారికి చేర్చాలని ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తేవడం జరిగిందని తెలిపారు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేర నెలకొల్పడం జరిగిందని దీంతో ఎన్నో పేద కుటుంబాలు బాగుపడ్డాయని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేదోళ్లకు ఒక జీవనాధారం అయిందని ఆయన తెలిపారు. బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగించి వి బి జి,రామ్ జి, చట్టాన్ని తీసుకువచ్చి వక్రభాషలు చెప్పడం జరుగుతుందని అన్నారు వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని ఉపాధి హామీ పథకం ముద్దు విబిజి రాంజీ చట్టం వద్దు అంటూ ఈనెల 28వ తేదీన కొరివిపల్లిలో నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పేదోళ్ల కడుపు కొట్టే పథకాలను బిజెపి ప్రభుత్వం తీసుకువస్తే బిజెపిని పాతర పట్టే రోజులు దగ్గర వచ్చాయని ఆయన తెలిపారు ఈనెల 28వ తేదీన చిన్న శంకరంపేట మండలం కొరివి పల్లి గ్రామంలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి పిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఏ సి సి జనరల్ సెక్రెటరీ తో పాటు మంత్రులు దామోదర్ రాజనర్సింహ వివేక్ వెంకటస్వామి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు సాన సత్యనారాయణ, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మాందాపూర్ తాండ సర్పంచ్ అశోక్ నాయక్, మాజీ జెడ్పిటిసి పోతరాజు రమణ, జంగారాయి మాజీ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యాదవరావు, మనోజ్ కుమార్, ఉదయ్ కుమార్, ఆకుల నవీన్, తిగుళ్ల బిక్షపతి, రాజ్ కుమార్ గౌడ్, యాదగిరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


